MPUPS దొంగ ఎన్కేపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల విద్యాధికారి ఎం హరిశ్చందర్
దోమ అక్టోబరు 28( జనం సాక్షి)
దోమ మండల పరిదిలోని దొంగ ఎన్కేపల్లి పాఠశాలలో మండల విద్యాధికారి ఎం. హరిశ్చంద్ర FLN కార్యక్రమంలో భాగంగా తరగతులవారీగా విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు . విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు , విద్యార్థుల హాజరుశాతం మెరుగుపడేలా చూడాలి .ఉపాధ్యాయులు ఖచ్చితంగా తరగతి ప్రణాళిక ,TLM వాడి బోధన చేయాలని గుర్తుచేశారు .విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికమైన ఆహారం అందించడం ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఎదుగుతారని సూచించడం జరిగింది .పాఠశాల సందర్శనలో బొంపల్లి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ వెంకటేష్ , ఉపాధ్యాయులు వీరప్ప, మల్లమ్మ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు .
MPUPS దొంగ ఎన్కేపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల విద్యాధికారి ఎం హరిశ్చందర్




