జుక్కల్ జూన్ 12,( జనం సాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పెద్ద కోడప్ గల్ మండలం కాటేపల్లి
జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం దాత పానుగంటి హన్మాండ్లు ఇచ్చిన నోట్ పుస్తకాలను విద్యార్థిని విద్యార్థులకు స్థానిక ఎంపీపీ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.పదవ తరగతి లో మొదటి స్థానం సాధించిన వికాస్ గౌడ్ , సిహెచ్ రజిత అనే విద్యార్థులకు ఒక్కొక్కరికి 5000రూపాయల చొప్పున నగదు అందజేశారు. సౌండ్ సిస్టమ్ ను పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పాఠశాలలో గల సరస్వతి విగ్రహాం వద్ద తేజ స్వామి ఆధ్వర్యంలో
ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాటేపల్లి గ్రామస్తుడైన దాత పానుగంటి హన్మాండ్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు పానుగంటి పెంటవ్వ,భూమయ్య జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేశానని, పాఠశాలకు సౌండ్ సిస్టమ్ అందించానని తెలిపారు.పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఒక్కొక్క విద్యార్థికి 5000 రూపాయల చొప్పున ఇద్దరి విద్యార్థులకు 10వేల రూపాయలు అందజేశానని తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను త్వరలోనే పంపిణీ చేస్తానన్నారు. పాఠశాలలోని పదో తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున పదివేల రూపాయలు అందజేస్తానని తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీపీ,దాత పానుగంటి హన్మాండ్లు,గ్రామ సర్పంచ్ లకు పాఠశాల తరఫున హెచ్ఎం సంజీవ్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ విఠల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆకుల పర్వయ్య, మల్లప్ప పటేల్, మొగుల గౌడ్, జానీ,హన్మాండ్లు పటేల్,మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ




