Thursday, 5 November 2026

విద్యార్థులను అభినందించిన సర్పంచ్

 

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామం మారుతి నగర్ కు చెందిన విద్యార్థులు చింత సంతోష్ రెడ్డి, గోకిన త్రిష లను శుక్రవారం సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అభినందించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎంపిసి విభాగంలో గోకిన త్రిష కి 470 మార్కులకు గాను 465 మార్కులు, చింత సంతోష్ రెడ్డి కి 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించినందుకు గాను సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అధ్వర్యంలో విద్యార్థుల ఇంటికి వెళ్ళి శాలువా కప్పి సన్మానించి అభినందించారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిషత్తు లో మరింత ముందుకు సాగాలని సూచించారు. పట్టుదలతో చదివి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణా రెడ్డి, చావ గోవింద్, ప్రజలు పాల్గొన్నారు.