స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ కెసిఆర్ ద్యేయం.
– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఫొటో : క్రిస్మస్ సందర్బంగా దుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ ముఖ్యమంత్రి కెసిఆర్ ద్యేయం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని నెం 2 గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రైస్తవులకు విందు, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొన్ని మత్తతత్వ రాజకీయ శక్తులు విభజించు పాలించు అనే కోణంలో ఇతర మతాలను కించపరిచి పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టడాని ప్రయత్నిస్తున్నాయని, కెసిఆర్ ముందు వాటి ఆటలు సాగవని అన్నారు. అన్ని కులాలు, మతాలు కలిసిమెలిసి ఉండే ప్రాంతం తెలంగాణ అని, కెసిఆర్ ఉన్నంతవరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని మతాలను ఆదరించే క్రమంలోనే పేద క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహల మద్య జరుపుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, తహసీల్దార్ కుమారస్వామి, కౌన్సిలర్ విజయ, కో అప్షన్ సభ్యురాలు జంగిలి మేరీ సుశీల, డిఎండబ్ల్యూఓ రాజేశ్వరి, బీఆరెస్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మహేష్ గౌడ్, పాస్టర్లు, క్రైస్తవులు, బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ కెసిఆర్ ద్యేయం




