–
రిటైర్డ్ మండల విద్యాధికారి దేవదానంహుజూర్ నగర్ ఫిబ్రవరి 8 (జనంసాక్షి): హుజూర నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు కీర్తిశేషులు పానుగోతు లక్ పతి నాయక్ (మాజీ మండల విద్యాధికారి) జ్ఞాపకార్థం వారి కుమారుడైన పానుగోతు గోపీనాథ్ పదవ తరగతి విద్యార్థులకు 20,000 రూపాయల విలువైన ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను రిటైర్డ్ మండల విద్యాధికారి దేవదానం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకొని పబ్లిక్ పరీక్షలో పదికి పది గ్రేడ్ మార్కులు తెచ్చుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెల ఉదయశ్రీ, తాతరాజు శ్రీనివాస్, లోకసాని శ్రీనివాసరెడ్డి, మాతంగి ప్రభాకర్ రావు, యరబోయిన ఉపేందర్, ఆరె వసంతరావు, శేషగిరి, అన్వేష్, వెంకటేశ్వర్లు, రవీందర్ రెడ్డి,బిఎల్ అరుణ రాణి, అశోక్ కుమార్, జానీ బేగం, మున్ని, శేఖర్, సి ఆర్ పి సైదులు, నాగేశ్వరరావు ,శ్రీకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.




