విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకే తొలిమెట్టు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టిందని ఆత్మకూర్(ఎస్) ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి తొలి మెట్టు టిఎల్ఎం మేళాను ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన విద్యను బోధించేందుకు, పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకు బోధన సామాగ్రి ఎంతో అవసరమని అన్నారు.మండల స్థాయిలో ప్రతి పాఠశాల నుండి తక్కువ ఖర్చుతో నాణ్యమైన బోధన సామాగ్రిని తయారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.టిఎల్ఎంను ఉద్దేశించి ఎంఈఓ ధారాసింగ్ మాట్లాడుతూ బోధనోపకరణాలతో విద్యార్థులకు బోధన సులభతరంగా ఉంటుందని , విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాలు పెంపొందుతాయని అన్నారు.టిఎల్ఎంను ఉపయోగించి బోధిస్తే విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవంతో పాటు అభ్యసన వేగం పెరుగుతుందన్నారు.బొమ్మల ద్వారా బోధిస్తే విద్యార్థులు తొందరగా అర్థం చేసుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తంగెళ్ళ వీరారెడ్డి, ఎంపీడీఓ మల్సూర్ నాయక్, ఎస్ఐ యాదవేంద్ర రెడ్డి, ప్రాథమిక పాఠశాల రామోజీ తండా కాంప్లెక్స్ హెచ్ఎం శంకర్ నాయక్ , శ్రీదేవి, రంగాచారి, కృష్ణ , నాయకులు మర్లా చంద్రారెడ్డి, ఉపాధ్యాయులు గోపగాని సుధాకర్ , వెంకటయ్య, వెంకట రెడ్డి, శ్రీనివాస నాయుడు, జిల్లా జానయ్య, సుదర్శన్ రెడ్డి, రఘు, ఆయా పాఠశాలల హెచ్ఏంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




