Tuesday, 3 November 2026

బీఆర్ యస్ పార్టీ సంక్షేమ పథకాల కోసం దేశం ఎదురు చూస్తుంది

 

 

 

 

 

 

 

 

కేంద్ర ప్రభుత్వ స్వార్థ రాజకీయాల కోసం సిబిఐ, ఈడి, ఐటి శాఖలను కీలు బొమ్మలుగా వాడుకుంటుంది
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం, జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు
ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 5 : తెలంగాణ రాష్ట్రములో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నాది అని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మండలంలోని షాబాధ  గ్రామంలో స్థానిక సర్పంచ్ రాధమ్మ, ఎంపిటిసి తిరుపతి రెడ్డి అధ్యక్షుతన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతీథులుగా జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం, కాన్స్యూమర్ ఫోరం అధ్యక్షులు గట్టు తిమ్మప్ప లు హాజరయ్యారు ఈ సందర్బంగా బాబు జగ్జీవన్  రావ్ 116వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మాజీ జడ్పిటిసి ఖగునాథ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్సీ తక్కెలపల్లి  రవీందర్ రావు  మాట్లాడుతూదేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని అన్నారు. నేటికీ గుజరాత్ రాష్ట్రంలో ఆరు గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేకుండా దిక్కులేని పార్టీగా మారిందన్నారు. 2014 సంవత్సరానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండేవని, కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజల మూడు పూటలు కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు ఇవ్వకుండ ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. తెలంగాణలో రైతులు పండించిన పంటలను కొనకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్న మాట వాస్తవం కాదా అని బిజెపి నాయకులను సూటిగా ప్రశ్నించారు. కోటి నలుబై లక్షల  క్వింటాళ్ల ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర పండించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో రైతులు విప్లవంమొదలైందని, అది మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు చేరుకొని అక్కడ తిరుగుబాటుకు శంఖారావం పూరిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం మాట్లాడుతూ బీజేపీ పార్టీ పాలిస్తున్న ప్రాంతాలలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందని విమర్శించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ సుదీర్ఘ కాలం ఉన్న గుజరాత్ లో దారిద్య్రం ఆరున్నర శాతం నుండి ఎనిమిదిన్నర శాతానికి పెరగడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు. 27 రాష్ట్రాలలో ఇప్పటికీ ఒక్క పూట పస్తులు ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కపూట బోజనాలకే పరిమితమై దేశంలో పస్తులుంటున్న వారి శాతం 35 నుండి 40 శాతానికి చేరుకుందన్నారు. అలాగే జడ్పి చైర్మన్ సరిత మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను పకడ్బందీ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కితాబిచ్చారు. నియోజకవర్గంలో మళ్లీ గెలుపొందడం ఖాయమని, ఇక్కడ మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృతనిశ్చయంతో అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ పాత్ర కీలకం కానుందని వారు అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాధం మాట్లాడుతూ అబ్ కీ బార్. కిసాన్ కీ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని, వారిని నమ్మవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను కీలు బొమ్మలగా చేసుకొని బిజెపి పార్టీ వ్యతిరేక రాష్ట్రాల మీద ఉపయోగించుకుంటూ శాఖలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జడ్పిటిసి రాజు, మాజీ అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మంద శ్రీనాథ్, ఆర్డియస్ మాజీ  చైర్మన్ తనగల సీతారాం రెడ్డి, సంకపురం రాముడు, టిఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు మహేశ్వరెడ్డి, సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వీరాపురం నాగేష్, ఆయా శాఖ చైర్మన్ లు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఆత్మీయ సమ్మేళనానికి మండల స్థాయి ప్రజా ప్రతినిధులు గైరాజర్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ స్నేహ, జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత గైరాజరయ్యారు. స్థానిక మండల పరిధిలోని షాబాద్  గ్రామంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కాకపోవడంతో వీరందరూ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ  చల్లా వర్గానికి చెందిన వారందరూ సమ్మేళనానికి దూరంగా ఉన్నారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో వర్గ పోరు ఇలాగే కొనసాగితే బిఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పవు అన్నట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు.