Thursday, 5 November 2026

విద్యార్థుల తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై అవగాహన

హైదరాబాద్‌ : శాసనసభలోని ఇందిరాప్రియదర్శిని అడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు అటోలు, ద్విచక్రవాహనాలనే నిందించడం సరికాదని, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందన్నారు. విద్యార్థులను పాఠశాలలకు, ఇళ్లకు తీసుకెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు సామాజిక బాద్యతగా పిల్లలకు అవగాహన కల్పించే బాధ్యత చేపట్టాలని కమిషనర్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *