విద్యావంతులైన మధ్య తరగతి ప్రజలు.. 

రాజకీయాల్లోకి రావాలి
పోరాడకపోతే మనల్ని వెన్నుముక లేనివారిలా మార్చేస్తారు
రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌స్థాయిలో రాజకీయ శిక్షణలు
ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడుతున్నాం
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
అమరావతి, జూన్‌23(విద్యావంతులైన మధ్య తరగతి ప్రజలు..
రాజకీయాల్లోకి రావాలి
పోరాడకపోతే మనల్ని వెన్నుముక లేనివారిలా మార్చేస్తారు
రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌స్థాయిలో రాజకీయ శిక్షణలు
ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడుతున్నాం
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
అమరావతి, జూన్‌23(జ‌నం సాక్షి) : విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు రాజకీయాలకు దూరంగా పారిపోవద్దని, రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా నిరూపించుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సగటు మధ్యతరగతి పౌరుడు రాజకీయాల పట్ల ఆశను కోల్పోతున్నాడని చెప్పిన పవన్‌.. తాను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని తెలిపాడు. మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడాలనే తాను నిర్ణయించుకున్నానని జనసేనాని తెలిపాడు. మన జీవితాన్ని అనునిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్‌ పిలుపునిచ్చారు. పోరాడకపోతే.. మనల్ని వెన్నెముక లేని వారిలా మార్చేస్తారన్నారు. పోరాట స్ఫూర్తిని వీడొద్దని, రాజకీయాల్లో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా మారాలని కోరుకుంటున్నా అని అన్నారు. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కును కోల్పోవద్దని, 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడిందని, మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నానని, మన మాతృభూమికి వారి భాగస్వామ్యం అవసరం అని పవన్‌ ట్వీట్‌ లో పేర్కొన్నారు. జనసైనికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌ స్థాయిలో రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పవన్‌ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. జూన్‌ చివరి నుంచి జనసేన వ్యూహకర్త దేవ్‌ ఆధ్వర్యంలో విశాఖలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని జనసేనాని చెప్పారు. ఈ శిక్షణలో విద్యావంతులైన మధ్య తరగతి యువత పాల్గొని రాజకీయాల్లో నూతన మార్పుకు శ్రీకారం చుట్టేలా తయారుకావాలని పవన్‌ పిలుపునిచ్చారు. ) : విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు రాజకీయాలకు దూరంగా పారిపోవద్దని, రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా నిరూపించుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సగటు మధ్యతరగతి పౌరుడు రాజకీయాల పట్ల ఆశను కోల్పోతున్నాడని చెప్పిన పవన్‌.. తాను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని తెలిపాడు. మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడాలనే తాను నిర్ణయించుకున్నానని జనసేనాని తెలిపాడు. మన జీవితాన్ని అనునిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్‌ పిలుపునిచ్చారు. పోరాడకపోతే.. మనల్ని వెన్నెముక లేని వారిలా మార్చేస్తారన్నారు. పోరాట స్ఫూర్తిని వీడొద్దని, రాజకీయాల్లో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా మారాలని కోరుకుంటున్నా అని అన్నారు. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కును కోల్పోవద్దని, 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడిందని, మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నానని, మన మాతృభూమికి వారి భాగస్వామ్యం అవసరం అని పవన్‌ ట్వీట్‌ లో పేర్కొన్నారు. జనసైనికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్‌ స్థాయిలో రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పవన్‌ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. జూన్‌ చివరి నుంచి జనసేన వ్యూహకర్త దేవ్‌ ఆధ్వర్యంలో విశాఖలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని జనసేనాని చెప్పారు. ఈ శిక్షణలో విద్యావంతులైన మధ్య తరగతి యువత పాల్గొని రాజకీయాల్లో నూతన మార్పుకు శ్రీకారం చుట్టేలా తయారుకావాలని పవన్‌ పిలుపునిచ్చారు.