Thursday, 5 November 2026

వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆయుర్వేద ఔషధాలపై అవగాహన సదస్సు

వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆయుర్వేద ఔషధాలపై అవగాహన సదస్సు
మెట్పల్లి టౌన్, జనవరి 11,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణంలోని లిమ్రా గార్డెన్ లో ఆయుర్వేద మెడిసిన్ జీవన్ సేవ్ గ్రూప్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద ఔషధాలపై పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ నాగ నాథ్ ఆయుర్వేద మెడిసిన్ గురించి అవగాహన చేశారు ,
జీవన్ సేవ్ గ్రూపు సంస్థకు చెందిన మల్టీనోవా, స్పీడ్ లీనా, లైఫ్ ఆఫ్,నారీ సంరక్షణ,పెన్డౌట్ పెయిన్,గోల్ డైపోకేర్, సుప్రభాత్ హెయిర్ ఆయిల్ వంటి పలు రకాల ఆయుర్వేద ఔషధాలపై ప్రజలకు వివరణ చేశారు,వీటి ద్వార స్వయం చాలికమైన శక్తివంతంగా ఉంటారని మానవ శరీర నిర్మాణం మరియు క్రియాత్మక పరిణామం కణం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యాయం ప్రకారము ఈ కణం ఆరోగ్యం ఉండాలంటే రోజు మనం తీసుకునే ఆహారము ద్వారా సుమారు 167 రకాల పోషకాలు అవసరమని, కావున జీవన్ సేవ్ అందిస్తున్న మళ్టినోవా తదితర ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా పిండి పదార్థాలు మాంసకృతులు విటమిన్స్ వంటివి చాలా చాలా అందుతాయని అన్నారు ,
ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ యూసుఫ్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు కుతుబ్ పాషా, షాకీర్,నజీమా,రమేష్ ,సాగర్, జీవన్ సేవ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .