Tuesday, 3 November 2026

విద్యుత్తు కోతపై సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌: అసెంబ్లీ జరుగుతున్న తీరుపై తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు కోతపై సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విద్యుత్తుకోతలు మన రాష్ట్రంలోనే ఉన్నాయాన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై ప్రభుత్వానికి పట్టటం లేదు. కాంగ్రెస్‌ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. సభలో చర్చ జరిగితే వాస్తవాలు బయటకొస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *