Monday, 2 November 2026

విద్యుత్‌ ఒప్పందాల రద్దు తగదు 

 హైకోర్టులో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల కేసు
అమరావతి,జూలై25(జ‌నంసాక్షి): టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలపై సవిూక్ష జరపాలన్న జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యుత్‌ ఒప్పందాలతో రాష్ట్రానికి వేలకోట్లు నష్టం జరిగిందంటూ జగన్‌ ప్రభుత్వం విచారణ చేయాలని నిర్ణయించింది. దీంతో పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల సవిూక్షను నిలిపివేయాలని కోరుతూ 40 విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. పవర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్లపై(పీపీఏ) జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని పిటిషన్లలో పేర్కొన్నాయి. సుమారు 14 పిటిషన్లు దాఖలవ్వగా.. జస్టిస్‌ ఎం.గంగారావు నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరపనుంది. విద్యుత్‌ ఒప్పందాల్లో సవిూక్ష జరపాలని ఆదేశిస్తూ గత నెల ఒకటో తేదీని ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఈ నిర్ణయం సరైనది కాదంటూ కేంద్ర విద్యుత్‌ సంస్థ రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగిన విద్యుత్‌ ఒప్పందాల్లో అంతా పారదర్శకమేనని ఆ లేఖల్లో పేర్కొంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సవిూక్షకే ముందడగు వేయడంతో.. విద్యుత్‌ సంస్థలు హైకోర్టు మెట్టెక్కాయి.