Wednesday, 4 November 2026

విద్యుత్ చౌక, తాగునీరు ఉచితం

న్యూఢిల్లీ(జ‌నంసాక్షి) : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషించిన విద్యుత్, తాగునీటి భారాల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించింది. 400 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించింది. కుటుంబానికి రోజుకు ఏడు వందల లీటర్లు, నెలకు 20 వేల లీటర్ల తాగునీరు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాల వల్ల ఢిల్లీలోని 90 శాతం ప్రజలకు మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఇవి మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. వీటివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్నది ఇంకా అంచనా వేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను క్రమంగా నెరవేరుస్తామని సిసోడియా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *