హైదరాబాద్: యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో కూడా బౌలర్లపై విరుచుకుపడి అర్ధశతకం సాధించిన ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రైన్(50) ఔటయ్యాడు. అతను కేవలం 24 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఓబ్రైన్ మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జావేద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఐర్లాండ్ విజయానికి 26 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.




