Thursday, 5 November 2026

మంత్రి కొప్పుల కు అంబేద్కర్‌ విగ్రహం అందించిన జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : హైదరాబాద్‌ నడిబొడ్డున ఆకాశమే హద్దుగా బారత రత్న రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించి సక్సెస్‌ చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కి పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని మినిష్టర్స్‌ క్వాటర్స్‌లో మంత్రిని శనివారం పుట్ట మధు మర్యాద పూర్వకంగా కలిసి శుబాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను ఆకాశమంత ఎత్తులో నిలిపడం, అందుకు ఎంతో కృషి చేసి ఆవిష్కరణను సక్సెస్‌ చేసిన మంత్రికి ఆయన అంబేద్కర్‌ విగ్రహాన్ని అందజేసి శుబాకాంక్షలు తెలిపారు.