సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ పోటీలను సాయి దీప్తి నర్సింగ్ హోం వారి సహకారంతో ఈ నెల 12న ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ , కార్యదర్శి ఎల్.సంతోష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్ల లోపు బాలబాలికలు తమ పేర్లను ఆదివారం ఉదయం 10 గంటల్లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు.విజేతలకు కప్ తో పాటు మెడల్స్ అందజేయనున్నట్లు చెప్పారు.ఇతర వివరాక కోసం ఎల్.సతీష్ కుమార్ సెల్ నంబర్స్ 8555008996 , 9394753343 లలో సంప్రదించవచ్చని తెలిపారు.




