విద్యుత్ సమస్యలపై ట్రాన్స్ కో డైరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాస్ రెడ్డి తో సమాసమైన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 14 :కూకట్ పల్లి కాన్స్టెన్సీ లోనిఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ లో విద్యుత్ సమస్యలపై ట్రాన్స్కో డైరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాస్ రెడ్డి తో.కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలోఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్లో ఈ సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ డివిజన్లో బోయిన్ చెరువు కట్ట పైన కొత్త పోల్స్. ట్రాన్స్ఫారం కెపాసిటీ పెంచవలసిందిగా విజ్ఞప్తి చేశారు కొత్తవి 300 పోల్స్ కావాలని అలాగే కొన్ని ప్రాంతాలలో బంచ్ కేబుల్ కావాలని కార్పొరేటర్ కోరడం జరిగింది.ఈ సమావేశానికి కూకట్పల్లి కాన్స్టెన్సీ ఆల్ డివిజన్స్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్,ఆవుల రవీందర్ రెడ్డి, సతీష్ గౌడ్, శిరీష బాబురావు,సభ్య గౌసిద్దీన్, జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాసరావు, మహేశ్వరి శ్రీహరి, తూము శ్రావణ్ కుమార్ వారి డివిజన్లో సమస్యలు శ్రీనివాస్ రెడ్డి కి తెలిపినారు.శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఎక్కడ ఈ సమస్య ఉన్న త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది,మరియు విద్యుత్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు వర్క్స్ అధికారులు సమీక్ష సమావేశము కాన్స్టెన్సీలో విద్యుత్ సమస్యలు ఎక్కడ ఉన్నా వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు డైరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. సీజీఎం నరసింహ స్వామి,ఎస్ఈ చంద్రశేఖర్,ఎస్ఈ రవికుమార్,డి ఈ బిక్షపతి,ఏడి కృష్ణ,ఏఈ అఖిల్,మరియు ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.