సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ నాయకులు
టేకులపల్లి, నవంబర్ 21( జనం సాక్షి): టేకులపల్లి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కొత్తగా విధుల్లో బాధ్యతలు స్వీకరించిన సీఐ ఇంద్రసేనారెడ్డిని స్థానిక టిఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్, బోడ బాలు నాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ బర్మావత్ శివ కృష్ణ, మండల ప్రచార కార్యదర్శి జాటోత్ నరేష్ నాయక్, సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్ ,ఎంపీటీసీ భూక్య బాలకృష్ణ, బానోత్ రవికుమార్ , గుగులోత్ కృష్ణ ,రమేష్, బానోత్ నాగేందర్, బోడ రమేష్,అంతోటి రాకేష్ , బర్మవత్ బిక్షం తదితరులు పాల్గొన్నారు.




