కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని వినాయక్ నగర్ లో లక్ష్మీ గణపతి సరస్వతి సమేత వినాయక స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి దంపతులు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సాంప్రదాయపద్ధంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయస్వామి కి ఐదు రకాలైన భక్తి భావాలున్నాయి. నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. శ్రీరాముడిని హనుమంతుడు ఐదు రకాలుగా కొలుస్తాడు. ఎప్పుడూ శ్రీరామ నామం స్మరిస్తూ, కీర్తిస్తూ, రాముని కరుణ ప్రేమకై పరితపిస్తూ (యాచన) తనని తాను అర్పించుకున్నాడు. ఇంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ శ్రీ పంచముఖి ఆంజనేయస్వామిని భక్తులు తప్పక దర్శించవలసిన ప్రదేశం ఉండటం చాలా సంతోషదాయకమని తెలిపారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పంచముఖ ఆంజనేయస్వామి ని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సిఐ రవీందర్, ఎస్ఐ నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, కొత్త బావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్, ఆలయ కమిటీ అర్చకులు డేరం జయప్రకాష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు లింగాల మధుసూదన్ రెడ్డి, వరికుప్పల శ్రీనివాస్, కందుల వెంకటరెడ్డి, తొసుగుండ్ల సుధాకర్ రెడ్డి, పాక లక్ష్మయ్య, వరికుప్పల పాండు, బొమ్మిడి శ్రీనివాస్, తోటపల్లి కిరణ్, తోటపల్లి వెంకటేశ్వర్లు, గోవర్ధన చారి, బొడ్డుపల్లి వేణు, పాక రామకృష్ణ హెచ్చ శ్రీరాములు, ముత్యపు రెడ్డి, మంగ్యా నాయక్, పెద్దిశెట్టి మహేందర్, పట్టణ ప్రజలు, అధికారులు ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వినాయక్ నగర్ లో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి




