భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):–యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక వినూత్న హాస్పిటల్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సతీష్ బట్ , పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర సిఐ.ఎల్.పి నేత బట్టి విక్రమార్క గారికి స్వాగతం పలికి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సతీష్ బట్ గారిని ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రావు , సతీష్ ను పరామర్శించి మెరుగైన చికిత్స జరిపించాలని వైద్యులను కోరడమైనది. ఇట్టి కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి తంగాల్లపల్లీ రవికుమార్ గారు, కుక్కధువ్వు సోమయ్య గారు, రఘుబాబు, కూర వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామీ, హరినాథ్ యాదవ్, కోర్ కమిటీ శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.




