Wednesday, 4 November 2026

విపలమైన జగన్‌ కోడికత్తి దాడి డ్రామా

కేంద్రం సహకరించకపోవడం దారుణం

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): జగన్‌ కోడి కత్తి డ్రామా దుర్మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీతో జగన్‌ లాలూచి పడ్డారని విమర్శించారు. మోదీ మోసం చేసినందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని వివరించారు. ప్రజల కోసమే మోదీపై తిరుగుబాటు చేశానని స్పష్టం చేశారు. మోసం చేసిన మోదీని నిలదీసినందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహకరించి ఉంటే ఏపీ ఇంకా అభివృద్ధి చెందేదన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఆశా వర్కర్ల ఆత్మీయ సమ్మేళనం జరగింది. సీఎం చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమ, కిడారి శ్రావణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చద్రబాబు మాట్లాడుతూ.. విపక్షాలు తనను తిడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీని మాత్రం ఒక్క మాట అనడం లేదని చెప్పారు. అమరావతిని ఆదర్శ రాజధానిగా

నిర్మిస్తున్నామని తెలిపారు.నల్లధనం బయటకు తీసుకువస్తామని చెప్పి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన ప్రత్యర్థులపై సీబీఐ, ఐటి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వార్ధం కోసం ఆర్‌బీఐ, సీబీఐని కూడా భ్రష్టు పట్టించారని విమర్శించారు. /ూష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆశా వర్కర్లదే కీలక పాత్ర అని కొనియాడారు. ఆశా వర్కర్లు కూడా సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రావిూణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యులతో క్యాంపులు నిర్వహించామని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో సరికొత్త అంబులెన్స్‌లు తీసుకొచ్చామన్నారు. అలాగే అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.