Wednesday, 4 November 2026

పాదయాత్ర కోసం రోజుకు రెండుకోట్లా?

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్‌ రోజుకు నడిచేది 10, 12 కిలోవిూటర్లని, దీని కోసం రోజుకు రూ. 2కోట్లు ఖర్చని ఆయన విమర్శించారు. చేసే పని ఏంటంటే నెత్తివిూద ముద్దులు పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడమేనని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ దీన్ని మార్కెట్‌ చేసుకుని, వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు సీట్లు అమ్ముకునే కార్యక్రమమని తులసీరెడ్డి ఆరోపించారు. హంగామా చూపించి, నాయకులు, కార్యకర్తల కొంపముంచి, వారితో ఖర్చులు పెట్టించే కార్యక్రమం తప్ప మరేవిూకాదని తులసి రెడ్డి అన్నారు.