మల్కాజిగిరి,జనంసాక్షి,జూలై 4విప్లవ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని మల్కాజిగిరి నియోజకవర్గ కురుమ సంఘం నాయకులు పేర్కొన్నారు.దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో కొమురయ్య చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు.భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్రలోనే మహా ఉజ్వల ఘట్టంగా వీర తెలంగాణ పోరాటన్ని రగిలించిన అగ్గి వీరుడు దొడ్డి కొమురయ్య ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు
.కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు జోగు వెంకటేశ్ కురుమ,ప్రధాన కార్యదర్శి మిరియాల రాంచందర్,కోశాధికారి వగ్గు మురళీకృష్ణ కురుమ,ప్రొఫెసర్ డాక్టర్ ఐల చంద్రయ్య కురుమ,రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు వగ్గు చంద్రశేఖర కురుమ,నగర కురుమ సంఘం ఉపాధ్యక్షులు చేకూరి రామ్మోహన్ కురుమ,కానుగంటి పరంధాములు కురుమ,ప్రధాన కార్యదర్శి గుత్తి రామచందర్,చిందం హరి,ఆసర్ల శ్రీకాంత్,మౌలాలి డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు జోగు కుమారస్వామి,కొమురయ్య కురుమ, చేగురి వెంకటేష్ ఐల ఆంజనేయులు, కుండే నరేష్,ఐల బీరప్ప,గుంటి భీమ్రాజ్,మల్లేష్ కురుమ,జోగు శ్రీనివాస్, సిద్ధులు,పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
విప్లవ వీరుడు దొడ్డి కొమరయ్య.




