Tuesday, 3 November 2026

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి._యాదగిరి కౌన్సిలర్

. జనం సాక్షి దుబ్బాక. వర్షాకాలములో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆశ యాదగిరి 14 వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి 14 వార్డులో వీధి వీధికి దోమల నివారణ కోసం మలతీన్ మందును పీచుకారి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ఇంట్లో మురుగునీటిని నిల్వ నివారణ చర్యలు తీసుకోవాలని తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. పాత వస్తువులలో మరియు పాత టైర్స్ డబ్బాలను తొలగించాలని వాటిలో వర్షం నీరు పడి నిలువ వుండి వ్యాధులకు మూల కారణం అవుతాయని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ జవాన్ అనిల్ కుమార్ బూత్ కమిటీ అధ్యక్షుడు ఎల్లారం చందు కార్యకర్తలు పాల్గొన్నారు.