Thursday, 5 November 2026

విప్లవ వీరుల ఆశయాలకై  పోరాడుదాం.

సీపీఐ మంచిర్యాల పట్టణ కార్యదర్శిఖలిందర్ అలీఖాన్

భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల ఆశయాలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని సిపిఐ పట్టణ కార్యదర్శ ఖలిందర్ అలీఖాన్  అన్నారు  సర్దార్ భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా   మాట్లాడుతూ సర్దార బ్రిటిష్ వలసదారుల దోపిడీ పరిపాలనను పారదోలి భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన జాతీయ ఉద్యమంలో అనేకమంది బలిదానాలు చేశారని, అందులో విప్లవ విద్యార్థి యువకిశోరలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, జైళ్లను, లాఠీలను, తూటాలను, ఉరికంబాలను చిరునవ్వులతో ముద్దాడిన సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు  సుఖ్ దేవ్ లు ఇంకిలాబ్ జిందాబాద్ సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నవ్వుతూ ఉరి కంభం ఎక్కారు
,   వారి అమరత్వానికి నేటికీ 92 ఏళ్ళు నిండాయని వారు కోరుకున్న సమాజం నేటికి సిద్ధించలేదని , దోపిడీ, పీడన లేని సమాజం కోసం విద్యార్థి, యువజనులు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం  ఉందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వరుసగా అధికారం చేపట్టి తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా సమస్త రంగాలను సంక్షోభంలోకి నెట్టుతూ, ముఖ్యంగా జాతీయ నూతన విద్యా విధానం 2020 పేరుతో విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తూ, కార్పోరేట్ కరణ చేస్తూ రిజర్వేషన్లకు పాతర వేస్తున్నారని మండిపడ్డారు.   దేశ్ కి చౌకి దార్ అని చెప్పుకొని తిరిగే నరేంద్రమోడీ విధానాలను ప్రతి ఒక్కరు ఖండిస్తూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ కార్యదర్శి కలిందర్ అలీ ఖాన్ నాయకులు దేవి పోచన్న చాడ మహేందర్ రెడ్డి బియ్యల రాజేశం యాదగిరి కుర్ర అంజి నరసయ్య తదితరులు పాల్గొన్నారు