Tuesday, 3 November 2026

విభేదాలులేవు

– చీలిక అన్నది కూడా ఊహాగానమే
– కొట్టి పారేసిన ప్రకాశ్‌ కారత్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):సీపీఎం పార్టీలో విభేదాలున్నాయన్నది కేవలం భ్రమ మాత్రమే అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ స్పష్టం చేశారు. పార్టీలో చీలికలు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పారు. పార్టీ జాతీయ మహాసభల్లో పాల్గొటున్న ఆయన హైదరాబాద్‌లో పార్టీ తెలంగాణ కార్దయర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి విూడియాతో మాట్లాడారు. రాజకీయ తీర్మానంపై చర్చ ముగిసిందని ఆయన తెలిపారు. చర్చ సందర్భంగా వచ్చిన సవరణలపై ఓటింగ్‌ జరుగుతుందన్నారు.  ఆ తర్వాత రాజకీయ ముసాయిదాను నిర్ణయిస్తామన్న ఆయన.. దీనిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఓటింగ్‌ నిర్వహించి తుది ముసాయిదాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ రాజ్యాంగం ప్రకారం రహస్య ఓటింగ్‌ ఉండదన్నారు. అంతా బహిరంగ ఓటింగే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో ఏ అభిప్రాయమైనా పారదర్శకంగా ఉంటుందన్నారు. ఇందులో రహస్యమేమి ఉండదని చెప్పారు. రాజకీయ తీర్మానంపై ఈ రాత్రికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రకాశ్‌ కారత్‌ వెల్లడించారు. అయితే  సిపిఎం పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, పార్టీలో చీలికలు వస్తాయన్న ప్రచారం కూడా సరికాదని ఆయన పేర్కొన్నారు.  పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ సిపిఎం ముందుకు సాగుతుందని ఆయన వెల్లడించారు. పార్టీ పటిష్టతకు కూడా చర్యలు తీసుకుంటామని కారత్‌ తెలిపారు.

 

విస్తుందన్నారు.