Wednesday, 4 November 2026

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జనంసాక్షి):

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వీదేశీ కరెన్సీ పట్టుబడిరది. సోమవారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. ఈవై`275 అనే విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన అలియా భాను అనే ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద 10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు.