హైదరాబాద్ : ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో విమానం కూలిపోయిన ప్రదేశానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చేరుకున్నారు. ఆమెతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు లాండె వున్నారు. అనంతరం స్పెయిన్ ప్రధాని మారియనొ రాజెయో కూడా అక్కడకు విచ్చేశారు. విమాన ప్రమాద మృతులకు ముగ్గురు నేతలు నివాళులర్పించనున్నారు.




