విముక్తి….
“దిశ” మానం చెరిచి
ప్రాణం తీసిన మృగాళ్ల
పిట్టల్లా కాల్చి పారేసాం
ఇంకేం…
వాడవాడలా ఆనంద వీచికలు
ఊరు ఉరూర ఉత్సవ సందళ్ళు
దేశం నిండా ప్రశంసల జల్లు
మొత్తంగా విజయ గీతాలాపనలు
ఇంతటితో
ఉన్మాదుల వికృత చేష్టలు ఉడిగేనా?
అతివ రెక్కలు విచ్చుకు స్వేచగా ఎగిరేనా?
ఎన్కౌంటర్ చేస్తేనో….
జైళ్లలో ఖైదీగా బందిస్తేనో…
ఉరికొయ్యకు వేలాడేస్తేనో…
సమస్య పరిస్కారమైతే
లెక్కకు మించి దారుణాల పునరావృతమేలా?
కన్నవాళ్ళ కన్నీటి సంద్రం ఉప్పొంగుట ఎలా?
వేళ్ళకు సోకిన “తెగుళ్లు” తొలిస్తేనే…
పంటచేలు పచ్చగా చిగురించేది
మనసున అంకురించు “విష” బీజాల
వినాశనం చేస్తేనే “మనిషితనం” పండేది
ప్రాణాల తోడెయ్యటం కాదు
పాప చింతనల అంతం చేయాలి
నివారణ కాదు “నిరోధం” అనివార్యం
ఇప్పుడు చేయాల్సిందల్లా…
మనిషిని “మృగం” చేయు
మద్యం దారకు అడ్డుకట్ట వేయాలి
ఆశ్లీలతను కుమ్మరించు అంతర్జాల
మహమ్మారి “కోరలు” తెంచాలి
ప్రాశ్చాత్య పోకడల “ఉడలు” పెరకాలి
సామాజిక అంతరాల “వంతెన” కూల్చాలి
నైతిక, మానవ విలువల బోధన
ఇంటినుండే మొదలవ్వాలి
మహిళా సంరక్షణ ధ్యేయంగా
ప్రతి అడుగు ముందుకు సాగాలి
అప్పుడే….
“స్త్రీ” జాతికి విముక్తి
“””””””””””””””
కోడిగూటి తిరుపతి
(జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత)
Mbl no :9573929493