Friday, 6 November 2026

విశ్రాంత సైనికుడికి ఘన సన్మానం.

విశ్రాంత సైనికుడికి ఘన సన్మానం.

కోటి వీరేష్ డిసెంబర్ 27 జనం సాక్షి:-దేశ సేవ కోసం సుదీర్ఘ కాలం సరిహద్దుల్లో పనిచేసి ఇటీవలే పదవి విరమణ పొందిన గంగాయప్పకి స్వామండలంలో ఘన స్వాగతం లభించింది.30 ఏళ్ల పాటు సైనికుడిగా సేవలందించి పదవి విరమణ పొందిన సైనికుడు గంగాయప్పకు పోతంగల్ మండల యువకులు,ప్రజలు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది,త్రివర్ణ పతాక రెపరెపల మధ్య పూల దండలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం పోతంగల్ మండల కేంద్రం నుండి ఆయన స్వగ్రామమైన హంగర్గ గ్రామం వరకు స్థానికులు,మండల వాసులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని బైకు ర్యాలీ నిర్వహిం చారు.ఈ సందర్భంగా గంగాయ్యప్పకి అడుగడుగునా నీరాజనం లభించింది.ఈ ఘన సన్మాన ర్యాలీలో పోతంగల్ మండల యువకులు పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.