విలేకరులపై దాడి చేసిన ఇసుక మాఫియా నాయకులను వెంటనే అరెస్టు చేయాలి
-డీఎస్పీ వినతిపత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు.
గద్వాల నడిగడ్డ, జనవరి 7 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో శుక్రవారం ఇద్దరు జర్నలిస్టులపై ఇసుక మాఫియా అక్రమార్కులు దాడి చేసినందుకుగాను వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కి శనివారము వినతి పత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిరిబాబు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టుపై దాడి చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని వారు మండిపడ్డారు.సానుకూలంగా స్పందించిన డిఎస్పి ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు
విలేకరులపై దాడి చేసిన ఇసుక మాఫియా




