బిచ్కుంద మే 22 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలతో పాటు తడ్గూర్, చిన్న దేవాడ, తలబ్ తాండ, హజ్గుల్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ యువ నాయకుడు సౌదాగర్ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువతో ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు చిన్న దేవాడ సర్పంచి సంతోష్, ఎంపీటీసి అవార్ సురేష్, దర్పల్ గంగాధర్, హజ్గుల్ అన్వర్, ఇమ్రాన్, చింతల హన్మండ్లు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
వివిధ శుభ కార్యాలకు హాజరైన యువ నాయకుడు సౌదాగర్ అరవింద్




