Thursday, 5 November 2026

వివేకానంద, దావుద్‌ల మేథోస్థాయి ఒకటే:నితిన్‌గడ్కారీ

గడ్కారీ వ్యాఖ్యల పట్ల మండి పడిన కాంగ్రెస్‌

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

భూపాల్‌: నవంబర్‌5, (జనంసాక్షి):

ప్రముఖ అధ్యాత్మిక తత్వవేత్త స్వామి వివేకానంద, చీకటి ప్రపంచ ముఖ్యుడు దావూద్‌ హిబ్రహిం మేథోస్తాయి సమానమని, అయితే స్వామి తెలివితేటలను జాతి ప్రయోజనాలకోసం వినియోగించగా దావూద్‌ తన నేర సామ్య్రాజ్య నిర్మాణానికి వినియోగించారని బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారీ అన్నారు.

మనోతత్వశాస్త్రంలో ఐక్యూస్థాయిని కొలుస్తారు. అది వివిధ వ్యక్తుల మధ్య స్థాయి భేదంతో ఉంటుందన్నారు. ఇక్కడ ఇక అవార్డ్‌ ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం వివేకానంద, దావూద్‌ల ఐక్యూను మనం పోల్చవచ్చు. కాని దేశ నిర్మాణానికి, సర్వ మానవ సౌభ్రాత్వనికి, ఆధ్యాత్మిక చింతన వ్యాప్తికి వివేకానంద తన తెలివితేటలను వినియోగించగా దావూద్‌ నేరప్రపంచంలో తన ప్రతిభను చూపారన్నారు. కులం, మతం, లింగభేదం, భాషా భేదం తదితర అంశాలపై పురుషులు, మహిళల మధ్య విచక్షణ పాటించటం సరికాదని, వారి లక్షణాలను ఆధారితంగా నిర్ణయించాలని చెప్పారు. వివేకానందను ఉటంకిస్తూ 21వ శతాబ్ధం విజ్ఞాన యుగమని భారత్‌కు మంచి భవిష్యత్‌ ఉందన్నారు. డ్‌

గడ్కారీ వ్యాఖ్యల పట్ల మండి పడిన కాంగ్రెస్‌

గడ్కారీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ మండిపడింది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి మనీష్‌ తివారీ మాట్లాడుతూ గడ్కరీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరినీ ఎలా పోల్చుతారని ప్రశ్నించారు. గడ్కరీ ఐక్యును టెర్రరిస్ట్‌ కసబ్‌తో పోల్చితే ఎలా ఉంటుందన్నారు.

గడ్కరీ వివరణ

తాను వివేకానందను దావూద్‌ను పోల్చలేదని ఇరువురి మేఊథస్సు గురించే మాట్లాడానని, వివేకానంద మాదిరి సరైన మార్గంలో తెలివితేటలను వినియోగించినట్లయితే అది సమాజానికి మేలు చేస్తుందని కాని దావూద్‌ మాదిరి వినియోగించితే వినాశనానికి దారి తీస్తుందన్నారు.  కేవలం మనస్తత్వశాస్త్రం దృష్టిలో పెట్టుకుని తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *