జనంసాక్షి, మంథని : మంథనిలో సిఐటియు ఆధ్వర్యంలో వివోఏ లు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గ్రామ సంఘం అధ్యక్షురాలు పాల్గొని వివోఏ లకు సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఐకెపి వివోఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి. జ్యోతి మాట్లాడుతూ.. వివో ఏలు గత 23 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని అన్నారు. వివోఏలకు నెలకు వేతనం కేవలం 3900 రూపాయలు ఇస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తుందని అన్నారు. వివోఎల ఉద్యమానికి సంఘీభావం తెలియజేసిన కార్మిక సంఘాలు ప్రజా సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో సకల జనుల సమ్మెలో మహిళలు బతుకమ్మ ఆడుతూ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించారాని అన్నారు.ఐకెపి వివోఏ లు గా పనిచేస్తున్న వారు ఎక్కువ మొత్తంలో మహిళలే ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లైన కనీస వేతనం 26000 ఇవ్వాలని వివోఏ లను సెర్పు ఉద్యోగుల గుర్తించాలని ప్రమాద భీమను కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ ల అమలు చేసి వీరి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొవ్వూరు రాయలింగు,రౌతు మల్లయ్య, మంథని విద్యార్థి వ్యవస్థాపకులు కొండేల మారుతి, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు పోరెడ్డి వెంకట్ రెడ్డి,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ల సందీప్, ఉపాధ్యక్షులు ఎల్పుల సురేష్, బావు రవి,సామాజిక నాయకులు అడ్డురి సంపత్, ఇరుగుల ప్రసాద్,గ్రామ సంఘము అధ్యక్షురాలు వెంకటమ్మ, స్వరూప,పద్మ విఓఏ లు, రాజశ్రీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.




