Thursday, 5 November 2026

విశాఖ- మలేషియా విమాన సర్వీసు ప్రారంభం

హైదరాబాద్‌  జ‌నంసాక్షి : విశాఖ నుంచి నేరుగా మలేషియా వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసు ఇవాళ విశాఖలో ప్రారంభమైంది. మలిండో ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానం వారానికి మూడురోజుల పాటు అందుబాటులో ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మలేషియా నుంచి విశాఖకు వచ్చిన ప్రయాణికులను మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసులు స్వాగతం పలికారు. అలాగే విశాఖ నుంచి మలేషియా వెళ్తున్న ప్రయాణికులకు వీరు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విమానాలు విశాఖకు రావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *