Tuesday, 3 November 2026

విశాఖ రైల్వే జోన్‌ లేనట్లే

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): రైల్వే బడ్జెట్‌పై  కోటి ఆశలతో ఎదురుచూసిన తెలంగాణా, ఆంధ్ర  ప్రజలకు  మొండి చేయి ఎదురైంది. ప్రధానంగా విశాఖ రైల్వే జోన్‌  ఊసే లేకుండా పోయింది. అంతర్జాతీయంగా స్టేషన్లను ఆధునీకరిస్తామన్న గతంలో చేసిన ప్రకటనలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. తెలుగు రాష్టాల్రపై కొత్తమంత్రి సురేశ్‌ ప్రభు కూడా కనికరం చూపలేదు. రైల్వేమంత్రి సురేశ్‌ ప్రభు గురువారం లోక్‌ సభలో ప్రవేశపెట్టిన 2015 రైల్వే  బడ్జెట్లో  కొత్త రైళ్లూ  లేవూ.. కొత్త  లైన్లూ లేవు. రెండు రాష్టాల్రకు చెందిన పలువురు ఎంపీలు చేసిన  ప్రతిపాదనలన్నీ బుట్ట దాఖలయ్యాయి. విశాఖ, తిరుపతి  రైల్వే జోన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను మంత్రి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వై ఫైలూ, ఎంటర్‌ టైన్‌ మెంటూ తప్ప, బడ్జెట్లో  ఏవిూ లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట-విజయవాడ మధ్య  మూడో రైల్వే లైన్‌ ఏర్పాటు  ఒక్కటే  గుడ్డిలో మెల్లగా బావించాలి. పెండింగ్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన మంత్రి, తెలుగు రాష్టాల్లో  దశాబ్దాలుగా  పెండింగ్‌ లో  ప్రాజెక్టుల  ఊసే ఎత్తలేదు. ఆదాయంలో అగ్రభాగాన నిలిచే దక్షిణ మధ్య రైల్వేస్‌ .. కేటాయింపుల్లో శూన్యంగా మిగిలిపోయింది. మరోవైపు ఆంధప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను కూడా కేంద్రం పట్టించుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *