విశాఖపట్టణం,ఫిబ్రవరి26(జనంసాక్షి): విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటును ప్రకటించనందుకు నిరసనగా ప్రజలు విశాఖ రైల్వేస్టేషన్ ముందు ఆందోళన చేశారు. గో బ్యాక్ బీజేపీ, టీడీపీ ఎంపీలు అంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ అసమర్ధత వల్ల రైల్వేబడ్జెట్‌లో విశాఖకు తీరని అన్యాయం జరిగిందని ప్రజలు పేర్కొన్నారు. విశాఖను స్మార్ట్‌సిటీ చేద్దామన్నారు కానీ రైల్వేజోన్ ఇవ్వలేదని, ఎంపీలు ఉండి కూడా ఎవిూ చేయలేదని ఆరోపించారు. ఢిల్లీలోలాగా చీపురుతో టీడీపీకి, బీజేపీకి ఊడ్చేస్తామని హెచ్చరించారు. కోడిగుడ్లు, టమాటాలతో ఎంపీలపై దాడి చేస్తామన్నారు. విశాఖలో రైల్వేజోన్ సాధించే వరకూ పోరాడతామని ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు.




