విశ్వం పుట్టుక ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌


` ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు దొరకనున్న జవాబు
` సంయుక్తంగా రూపొందించిన అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు
` 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలు అందించనున్న భారీ టెలిస్కోప్‌
ఫ్రెంచ్‌గయానా,డిసెంబరు 25(జనంసాక్షి):ఖగోళ శాస్త్రంలో అంతులేని ప్రశ్నలకు జవాబులు కనుగోనే దిశగా మరో ముందడుగు పడిరది. విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయాణం ప్రారంభమైంది. ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్‌`5 రాకెట్‌ దీన్ని విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. 5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్‌ సేవలందించనుంది. రూ.73 వేల కోట్ల వ్యయంతో అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయ ప్రయాసలతో రూపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోపు అందించబోయే డేటా, వెలుగులోకి తెచ్చే సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిశోధనల కోసం ఒక కొత్త రంగాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఈ ప్రయోగానికి ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 1990లో ప్రయోగించిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపు విశ్వానికి సంబంధించిన అనేక నిగూఢ వివరాలను అందించింది. దాని వారసురాలిగా జేడబ్ల్యూఎస్‌టీని చెప్పుకోవచ్చు. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోప్‌ వివిధ దశలను దాటుకుని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది.
జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ ప్రత్యేకతలు
హబుల్‌ కన్నా జేడబ్ల్యూఎస్‌టీ వంద రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది. విశ్వం గుట్టు విప్పడంలో మరే టెలిస్కోపునకూ దీనంత సామర్థ్యం లేదు. చంద్రుడిపై చిన్న కీటకం ఉన్నా దాన్ని ఇది పసిగట్టగలదు.అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేడబ్ల్యూఎస్‌టీని అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. అంతా సవ్యంగా సాగితే ఈ అద్భుత సాధనం శనివారం రోదసిలోకి దూసుకెళుతుంది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్‌`5 రాకెట్‌ దీన్ని మోసుకెళుతుంది. వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయ ప్రయాసలతో రూపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోపు అందించబోయే డేటా, వెలుగులోకి తెచ్చే సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిశోధనల కోసం ఒక కొత్త రంగాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఈ ప్రయోగానికి ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జేడబ్ల్యూఎస్‌టీ అందించే సమాచారం కారణంగా మన పాఠ్యపుస్తకాలను మార్చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.1990లో ప్రయోగించిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపు విశ్వానికి సంబంధించిన అనేక నిగూఢ వివరాలను అందించింది. దాని వారసురాలిగా జేడబ్ల్యూఎస్‌టీని చెప్పుకోవచ్చు. విశ్వం పుట్టుక అనంతరం ఏర్పడిన తొలి గెలాక్సీలను ఇది శోధిస్తుంది. అంటే.. టైం మెషీన్‌ తరహాలో కాలంలో వెనక్కి వెళ్తుందన్నమాట! మన పాలపుంత వంటి నక్షత్ర మండలాలు ఏర్పడిన తీరును ఇది వెలుగులోకి తెస్తుంది. సూర్యుడు`భూమికి సంబంధించిన ‘లాంగ్‌రేంజ్‌ పాయింట్‌`2 (ఎల్‌2)’ వద్దకు వెళ్లే ఈ టెలిస్కోపు.. అన్ని దశలూ పూర్తిచేసుకొని పని ప్రారంభించడానికి ఆరు నెలలు పడుతుంది. ఇది వర్ణపటం (స్పెక్ట్రమ్‌)లోని పరారుణ తరంగదైర్ఘ్యంలో పనిచే స్తుంది. విశ్వం నిరంతరం విస్తరిస్తుంటుంది. అందువల్ల తొలినాటి విశ్వానికి సంబంధించిన దృశ్య కాంతి (విజిబుల్‌ లైట్‌), అతినీలలోహిత కాంతి బాగా సాగిపోయి పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్‌)గా మారుతుంది. దీన్ని ‘కాస్మోలాజికల్‌ రెడ్‌ షిఫ్ట్‌’ అంటారు. ఈ కాంతి మనిషి కంటికి కనిపించదు. దాన్ని ఒడిసిపట్టడం ద్వారా.. తొలినాటి విశ్వానికి సంబంధించిన దృశ్యాలను జేడబ్ల్యూఎస్‌టీ ఆవిష్కరిస్తుంది. ఈ పని కోసం టెలిస్కోపులో నియర్‌, మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ పరికరాలను అమర్చారు.పరారుణ కాంతిలో వీక్షించడానికి వీలుగా జేడబ్ల్యూఎస్‌టీ ఆప్టిక్‌ వ్యవస్థలో ప్రధానంగా నాలుగు దర్పణాలు ఉంటాయి. వాటి పరావర్తన సామర్థ్యం చాలా ఎక్కువ. దర్పణాలను బెరీలియంతో తయారుచేశారు. ఈ పదార్థం ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనూ దాని ఆకృతిని కోల్పోదు. విద్యుత్‌, వేడిని బాగా గ్రహిస్తుంది. బెరీలియంపై సన్నటి పొరలా బంగారం పూత వేశారు. ఈ పొర మందం 100 నానోవిూటర్లు మాత్రమే. మొత్తంగా దాదాపు 49 గ్రాముల స్వర్ణాన్ని వాడారు. బంగారం.. తనపై పడిన పరారుణ కాంతిలో 99 శాతాన్ని పరావర్తనం చెందిస్తుంది. టెలిస్కోపులోని భారీ ఆప్టిక్స్‌కు తోడ్పాటు అందించడానికి పదుల సంఖ్యలో ఉప వ్యవస్థలు ఉన్నాయి.జేడబ్ల్యూఎస్‌టీలో ప్రధాన భాగం` ప్రైమరీ మిర్రర్‌. ఇది షడ్భుజి ఆకృతిలో ఉండే 18 వేరువేరు దర్పణాలతో తయారైంది. ఒక్కోదాని వెడల్పు 1.32 విూటర్లు. ఒక్కోటి ఒక్కో టెలిస్కోపులా పనిచేయగలదు. అంతిమంగా అన్నీకలిసి ఒకే టెలిస్కోపులా పనిచేసి, మరింత స్పష్టమైన చిత్రాన్ని అందిస్తాయి. మొత్తంవిూద ప్రైమరీ మిర్రర్‌ వెడల్పు 6.5 విూటర్లు. హబుల్‌ ప్రధాన అద్దం వెడల్పు 2.4 విూటర్లు మాత్రమే.నాలుగో మిర్రర్‌ను ఫైన్‌ స్టీరింగ్‌ మిర్రర్‌ అని కూడా పిలుస్తారు. ఇది టెలిస్కోపు కదలికల వల్ల ఏర్పడే వైరుధ్యాలను సరిచేస్తుంది. చివరకు కాంతిలోని ఫోటాన్లు.. ఎలక్ట్రాన్లుగా మారి, ఒక చిత్రం ఏర్పడుతుంది. అది డేటా రికార్డర్‌లో నమోదవుతుంది. నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ ద్వారా భూమికి చేరుతుంది.