కోట్ల జగదీష్ కొండమల్లేపల్లి జనవరి 17 (జనం సాక్షి) న్యూస్: కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల జగదీష్ మాట్లాడుతూ నేడు బుధవారం తేదీ 18-01-2023 కొండమల్లేపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడం జరుగుతుంది పార్టీ నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అందరూ చౌరస్తా వద్దకు ఉదయం 9:30 గంటలకు చేరుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుడు ఉన్నత స్థాయికి చేరుకుని విజయాలు సాధించగలడని ఎన్టీఆర్ నిరూపించారని ఒక ప్రకటనలో తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ తెలుగువారికి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. సినీ పరిశ్రమలో మకుటం లేని రాజు, అసమాన రాజకీయ నాయకుడు. తెలుగువారికి గర్వకారణం అనే నినాదంతో ఆయన సాగించిన ప్రయాణం మరువలేనిది. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ సత్తా చూపించింది ఆస్వాదించడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి. సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన అధికారాన్ని అణగారిన వర్గాలకు చేరువ చేశారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు,వివిధ పార్టీల నాయకులు అభిమానులు తరలి రావాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు
విశ్వనట సార్వభౌమ, ఎన్టీఆర్ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు




