– ప్రజల ఆరోగ్యం విూకు పట్టదా?
– శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు
– డెంగీ నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి
– కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి
– ఎవరైనా డెంగీతో మరణిస్తే అందుకు విూదే బాధ్యత
– సొంత అకౌంట్ నుంచి రూ. 5లక్షలు చెల్లించాల్సి ఉంటుంది
– తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్24 (జనంసాక్షి): విూరు దేశ పౌరులు కాదా.. కోట్లు ఖర్చుచేసి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. విూరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు.. డెంగీ నివారణపై అసలేం చర్యలు తీసుకున్నారు.. కేవలం అవి కాగితాల్లోనే కనిపిస్తున్నాయంటూ తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని బుధవారం హైకోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే గురువారం విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, వైద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టుకు నివేదించారు. నగరంలో 427 చోట్ల దోమల
బెడద అధికంగా ఉందని అధికారులు తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని, డెంగీ వ్యాధి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోర్టుకు వివరించారు. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. డెంగీ నివారణకు తీసుకున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు తీసుకున్న చర్యలు కేవలం కాగితాలపై మాత్రమే కనబడుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగోలేదనీ, డెంగీని నివారించలేకపోతే మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారంగా చెల్లించాలని వ్యాఖ్యానించింది. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులదేనని స్పష్టంచేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగుంటే ప్రజలు కోర్టులకు ఎందుకు వస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మూసీ నదిని ఉత్నతాధికారులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించింది. మూసీ నదిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది ఇదే సమయంలో మరోసారి అధికారులు కోర్టుకు వివరణ ఇస్తున్న క్రమంలో తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. విూరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐఏఎస్‌లు ఈ దేశ పౌరులు కాదా అని న్యాయస్థానం తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరులు ఎవరైనా మరణిస్తే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొంది. అలా మరణించిన కుటుంబానికి ఐఏఎస్‌లు తమ సొంత అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సీఎస్ జోషి , ఐఏఎస్‌లు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్ , శాంత కుమారి, యోగితా రాణా సైలెంట్‌గా ఉండిపోయినట్లు తెలుస్తుంది.
విూరు దేశ పౌరులు కాదా?




