– టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
– కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్6 (జనం సాక్షి ) : టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించటమే కాకుండా, వారి నిర్లక్ష్యం, చేతగాని తనాన్ని తమపై రుద్దాలని చూడటం సరికాదని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూరియా అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేనందువల్లే యూరియా సమస్య తలెత్తిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే కేంద్రం 50శాతం యూరియాను తెలంగాణకు పంపిందని చెప్పారు. మరో 50శాతం యూరియా రెండు రోజుల్లో చేరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక ఉంటే ఈ సమస్య ఉత్పన్నమై ఉండేది కాదని అన్నారు. రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం యూరియాను పంపుతోందని చెప్పారు. రైతులు ఎవరూ యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్నారే తప్ప, వారి ఇబ్బందులను తొలగించడంలో ఎలాంటి శ్రద్ద చూపడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మొన్నటి వరకు వర్షాలు లేక రైతులు పంటలు సాగు చేసుకోలేక పోయారని, ఇప్పుడు వర్షాలు వచ్చి రైతుల పంటలు సాగుచేసుకున్నారని, వారికి వేసే సమయంలో యూరియా కొరత రైతులకు పెద్ద దెబ్బ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముందుస్తు ప్రణాళికతో కాకుండా తమకు తోచినట్లు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తుందని, దీంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు.
విూ చేతగాని తనాన్ని మాపై నెట్టకండి




