వీఅర్ఏల నూతన కమిటీ ఎన్నిక.వీఅర్ఏల నూతన కమిటీ ఎన్నిక.
కోటగిరి డిసెంబర్ 1 జనం సాక్షి:-బోధన్ డివిజన్ పరిధిలోని కోటగిరి మండలంలోని 14 గ్రామాలకు సంబంధించిన గ్రామ రెవెన్యూ సహాయకుల నూతన కార్యవర్గం గురువారం రోజున సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇదివరకు ఉమ్మడి కోటగిరి మండలంలో 28 గ్రామాలకు గాను 70 మంది గ్రామ రెవెన్యూ సహాయకులతో కూడిన కార్యవర్గం ఉండగా,ఇటీవల కోటగిరి మండలం నుండి పోతంగల్ గ్రామం నూతన మండలంగా ఏర్పాటు అయినందున,పోతంగల్ మండలంలోని 14 గ్రామాలకు సంబంధించిన గ్రామ రెవెన్యూ సహాయకులను పాత కార్యవర్గం నుండి తొలగించారు.ఈ సందర్భంగా 14 గ్రామాలతో కూడిన కోటగిరి మండల నూతన గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య వేదిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.ఈ కోటగిరి మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య వేదిక సంఘం అధ్యక్షులుగా ఎస్.కె షఫీ,ప్రధాన కార్యదర్శిగా ఎన్ శ్రీనివాస్, కోశాధికారిగా ఎన్. కిరణ్,సహకోశాధికారిగా ఎన్ బీం రావ్,ముఖ్య సలహాదారులుగా ఎస్.కె హైమద్, ఉపాధ్యక్షులుగా ఎం.మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికకు సంబంధించిన కాపీని స్థానిక ఎంఆర్ఓ శ్రీకాంత్ రావుకు నూతన కార్యవర్గ సభ్యులు అందజేశారు
వీఅర్ఏల నూతన కమిటీ ఎన్నిక.వీఅర్ఏల నూతన కమిటీ ఎన్నిక.




