వీణవంక ఏప్రిల్ 8 (జనం సాక్షి )వీణవంక మండలంలోని ఆయా గ్రామాలలో 19 కల్యాణలక్ష్మి చెక్కులను 10 సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి లబ్దిదారుని ఇంటివద్దకే వెళ్లి వారికి అందజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుపేదల గుండెల్లో గుడి కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వ పథకాలనుఇంటింటికి తీసుకు వెళ్తున్నారు ఈరోజు శనివారం రోజున. మండలంలోని రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, బొంతుపల్లి, గంగారం గ్రామాల్లో ప్రభుత్వం నుండి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను ఇంటి ఇంటికి పాడి కౌశిక్ ఆయనే స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు మేనమామలా సీఎం కేసీఆర్ మారారని, పేద ఆడబిడ్డల వివాహం అయిన వెంటనే కట్నంగా ఒక.లక్షా నూట పదహార్లు స్వయంగా అందజేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలను నేరుగా మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలు అమలు చేయడం లేదని వారు అన్నారు. అలాగే రానున్న ఎన్నికలల్లో ప్రజలు సీఎం కేసీఆర్ కు అండగా నిలబడాలని సూచించారు. లబ్ధిదారుల్లో బీజేపీ కార్యకర్తలు కూడా ఉండడంతో సంతోషంగా ఉన్నదని వారు చెక్కులను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నాయకులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, మూసి పట్ల తిరుపతిరెడ్డి. వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి, సర్పంచులు పోతుల నర్సయ్య, జున్నూతుల సునితా మల్లారెడ్డి, చదువు లక్ష్మి మహేందర్ రెడ్డి, పింగిలి కొమాల్ రెడ్డి, ఎంపీటీసీలు ఒడ్డెపల్లి లక్షీ భూమయ్య,. చదువు స్వరూప నర్సింహరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు చెక్క బండి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి, నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, జున్నూతుల జనార్దన్ రెడ్డి, అడిగొప్పుల సత్యనారాయణ, , మాడ రవీందర్ రెడ్డి, ఇట్టబోయిన రాజయ్య,. శరత్ రెడ్డి. గాజుల రవీందర్. తదితరులు పాల్గొన్నారు.




