Wednesday, 4 November 2026

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ కులస్తుల ఎల్లమ్మ తల్లి బోనాలకు చింతా ప్రభాకర్ కు ఆహ్వానం …

 

 

ఈనెల 11 న పట్టణంలో గౌడ కులస్తుల ఎల్లమ్మ తల్లి బోనాలు

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 7   :   ఈనెల 11 న పట్టణంలో గౌడ కులస్తుల ఎల్లమ్మ తల్లి బోనాలు జరుగుతున్నందున జిల్లా గౌడ సంఘం  ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గూడు మాట్లాడుతూ పట్టణ, ప్రజలు పరిసరాల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి బోనాల  పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గౌడ సంఘం బోనాలకు అందరూ ఆహ్వానితులేనని అందరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభూ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు,విజేందర్ రెడ్డి, గౌడ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. కౌండిన్య కులస్తుల సామాజిక బోనాల మహోత్సవానికి చింత ప్రభాకర్ ఆహ్వానంసదాశివపేట పట్టణ సొసైటీ  – 1 అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఈనెల 11న మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు సదాశివపేట ఎడ్ల బజార్ తిలక్ రోడ్,  శ్రీ బసవేశ్వర మందిరం నుండి సామాజిక బోనాల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతా ప్రభాకర్ ను సొసైటీ నాయకులు ఆహ్వానాన్ని అందజేశారు. చింతామణి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను సొసైటీ సభ్యులు అందజేసి ఆహ్వానం పలికారు.