Wednesday, 4 November 2026

సావెల్ గ్రామంలో సోసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

సావెల్ గ్రామంలో సోసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
మెండోరా నవంబర్ 7 ( జనంసాక్షి) నిజాంబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలో సొసైటీ చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి, సావెల్ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్,సోసైటీ డైరెక్టర్ లు,గ్రామ వీడీసీ చైర్మన్ మరియు వీడీసీ సభ్యులతో, రైతులతో కలిసి ఈ రోజు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినరు. చైర్మన్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులని కోరారు. దొడ్డు రకం ధర :2060/- సన్న రకం ధర : 2040/- గా ఉంటుందాని తెలిపారు. వడ్లు పోసుకోవడానికి గ్రౌండ్ ని చదును చేయిస్తూ సహకరిస్తున్న గ్రామ వీడీసీ కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు