‘వీరన్నపేటలో బతుకమ్మ చీరల పంపిణీ’

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో బతుకమ్మ చీరలను స్థానిక సర్పంచ్ కొండపాక భిక్షపతి, ఎంపీటీసీ శివ శంకర్ ల చేతుల మీదుగా శనివారం గ్రామ పంచాయతీ వద్ద మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాగుల రాము, మహిళా సంఘాల సీఏ గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.