Tuesday, 3 November 2026

వీరులను తలచుకోవడం మన విధి

మన్యం వీరుడు అల్లూరికి ఘనంగా నివాళి
ట్యాంక్‌బండ్‌పై అల్లూరి విగ్రహానికి కెటిఆర్‌ పుష్పాంజలి
హైదరాబాద్‌,జూలై4( జనం సాక్షి) : వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌,
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అందరికి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. జల్‌ జంగల్‌ జవిూన్‌ నినాదంతో కుమ్రం భీమ్‌ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని చెప్పారు. అదేవిధంగా తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరుసలిపారని వెల్లడిరచారు. అలాంటి వీరుల స్ఫూర్తితో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్‌ కేటాయించారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు గొప్ప వీరుడని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. అల్లూరి జయంతి వేడుకలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతవరకు అధికారికంగా జరుగలేదని ఇదే మొదటిసారన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మనదేశంలో పుట్టినందుకు అందరం గర్వపడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాము కొమరం భీం, అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ముందుకు సాగుతున్నామన్న కేటీఆర్‌..గిరిజన హక్కుల కోసం అల్లూరి పోరాడారని చెప్పారు. వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని.. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి మనదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం అన్నారు. కాల్చితే వెన్నువిూద కాదు.. గుండె విూద కాల్చమని ధైర్యంగా చెప్పిన మహాను భావుడు అల్లూరి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జల్‌… జంగల్‌… జవిూన్‌ కోసం కొమరం భీమ్‌ పోరాడారని… బ్రిటిష్‌ వారిపై అల్లూరి పోరాడారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 8 ఏళ్ళుగా తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారన్నారు. క్షత్రియుల కోసం స్థలం అడిగారని… క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్‌ కేటాయించారని అన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెడతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఉద్యమకారులను సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ మరిచిపోరని చెప్పారు.