వృద్ధుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం:మెజిస్ట్రేట్ సౌజన్య

మల్కాజిగిరి,ఆగస్టు21(జనంసాక్షి)
ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం దీన్ దయాల్ నగర్ లోని మారుతి ఓల్డ్ ఏజ్ హోమ్ హెల్త్ కేర్ సొసైటీలో జరిగిన కార్యక్రమానికి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా అదనపు జిల్లాజడ్జి వి.బాల భాస్కరరావు ఆదేశాల మేరకు19వ.అదనపు మేజిస్ట్రేట్ సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.వృద్ధుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ఏలాంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో నేరెడ్ మెట్  సిఐనరసింహ స్వామి,ఓల్డ్ ఏజ్ హోం సంస్థ నిర్వాహకులు సాయిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.