వెనిజులా: వెనిజులా అధ్యక్షుడిగా హ్యూగో చావేజ్ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆ దేశ నేషనల్ ఎలక్టోరియల్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రిలిమినరీ ఫలితాల ప్రకారం చావేజ్‌కు 54 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి హెన్రీక్ కాప్రిల్స్‌కు 44 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో ఆరేళ్ల పాటు చావేజ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఫలితాలు వెలువడిన తర్వాత చావేజ్ తన మద్దతుదారులకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.




