వెన్నెలకంటికి స్వల్ప గాయాలు

చెన్నై : సినీ గీత రచయిత వెన్నెలకంటి తన కుటుంబంతో సహా నెల్లూరు నుంచి చెన్నైకు కారులో వస్తుండగా బుధవారం నాయుడుపేట వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వెన్నెలకంటి భార్య ప్రమీలకు చెయ్యి విరగగా, వెన్నెలకంటికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.